గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్ రంగశాయిపేటలోని శ్రీ సీతారాచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తిరుమల శ్రీధరాచార్యులు తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ, ఫౌండ్రి ట్రస్ట్ చైర్మన్, ఆలయ సేవకులు తగిన ఏర్పాట్లు చేశారు.