వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటలో ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య శుక్రవారం రాత్రి తెలిపారు. కంచి దేవరాజు, పావని పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి నిద్రించిన దేవరాజు శుక్రవారం తెల్లవారుజామున కనిపించలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికిన ఆచూకీలేదు. పావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.