వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం స్వాతంత్ర్య వేడుకల నిర్వహణ కోసం జెండాలు కట్టే క్రమంలో ఎత్తైన బల్లపైకి ఎక్కిన అటెండర్ శ్రీధర్ ఆకస్మాత్తుగా బల్ల విరిగి కింద పడ్డారు. రక్షణగా ఆయనను పట్టుకున్న వ్యాయామ ఉపాధ్యాయుడు బొబ్బిలి వెంకన్న కుడి చేయి వేలు చివరి భాగం తెగిపోయింది. శ్రీధరు సైతం స్వల్ప గాయమైంది.