వరంగల్ ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సాయినగర్, గాయత్రి నగర్లోకి మంగళవారం తెల్లవారుజామున వరద పోటెత్తింది. దీంతో స్థానికులు ఆగమేఘాల మీద బయటకు వచ్చారు. అధికారులు ఎన్టీఆర్ నగర్ కు చెందిన 10-15 ఇళ్లను ఖాళీ చేయించి, వరంగల్ పోతనరోడ్ మార్వాడీ సామాజిక భవనానికి తరలించారు. పునరావాస కేంద్రానికి వచ్చిన 50 మందికి అల్పాహారం, భోజనాలు వడ్డించారు.