వరంగల్ లోని కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ గురువారం శంకుస్థాపన చేశారు. కృష్ణ కాలేజీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సుమారు రూ. 5 కోట్లతో మూడు అంతస్తుల్లో 15 తరగతి గదులతో పాటు 60 టాయిలెట్లను నిర్మిస్తున్నందుకు వారిని మంత్రి అభినందించారు.