వరంగల్ రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన జీఎం

66చూసినవారు
వరంగల్ రైల్వే స్టేషన్ ను శనివారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సందర్శించారు. మే 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం మాట్లాడారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్లలోని సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్