సుదనపల్లి సీపీఎం గ్రామ సర్వేలో హసన్పర్తి మండల కమిటీ సభ్యులు మంద సుచందర్ ఆదివారం సర్వే నిర్వహించగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఉద్యోగాల కల్పన, రైతులకు మద్దతు ధర, నిరుద్యోగ భృతి, సామాజిక న్యాయం వంటి హామీలు కేవలం మాటలకే పరిమితమైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.