కరుణ పరపతి సంఘం పేరుతో అందినంత దండుకొని నిర్వాహకుడు ఉడాయించాడు. బాధితులు గురువారం సాయంత్రం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కరీమాబాద్లో కరుణ పరపతి సంఘం నిర్వాహకుడు వెంకటయ్య రూ. 4 కోట్లు కాజేసి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. బాధితులు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడారు.