ఏప్రిల్ ఆరో తేదీన భద్రాచలంలో జరగనున్న శ్రీ రాముని కళ్యాణం కోసం కోటి తలంబ్రాల కోసం వడ్లను భక్తిశ్రద్ధలతో పాటలు పాడుకుంటూ రామున్ని తలపిస్తూ గోటితో వడ్లను ఒలచి రాములోరి కళ్యాణం కోసం పంపించనున్నారు వరంగల్ ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలు. 21 రోజులపాటు 21 రకాల హారతి ఇస్తూ 108 రకాల పిండి వంటలు చేసి ఆ రామునికి సమర్పించి వడ్లను చేతితో ఒలిచారు. ఒలచిన తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో శనివారం భద్రాచలం పంపించామని తెలిపారు.