రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూ రెన్స్ కంపెనీ లిమిటెడ్ 50 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 20న జాబ్ మేళ నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ ఆఫీసర్ ఉమారాణి శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 30 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న వారికి నెలకు రూ. 15, 000 నుంచి రూ. 25, 000 వరకు వేతనం చెల్లిస్తారని, వివరాలకు 9573885532లో సంప్రదించాలని సూచించారు.