వరంగల్ జిల్లాలోని తన సొంత గ్రామమైన వంచనగిరి కోటగండి మైసమ్మ బోనాలు సందర్భంగా బుధవారం బోనం ఎత్తుకొని బయలుదేరి తల్లికి మొక్కులను మంత్రి కొండా సురేఖ సమర్పించారు. ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.