అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కుల వర్గీకరణ కు వ్యతిరేకంగా బుధవారం వరంగల్ కాశీబుగ్గ సెంటర్లో మాల కులస్తులు ఆందోళన చేపట్టారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం జరిగిందని వాపోయారు. కేంద్రం చేయవలసిన కుల వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఏంటని ప్రశ్నించారు. వర్గీకరణ చేసి ఎస్సీ ఎస్టీలు కొట్టుకు చావండి అనే విధంగా ఈ కుల వర్గీకరణ జరిగిందని వాక్యానించారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు.