వైద్య విద్యార్థి హత్యాచారానికి నిరసనగా వరంగల్ నగరంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు వరంగల్ ఐఎంఏ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు నేతలు ప్రకటించారు. మహిళా వైద్యులకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసు ఔటోపోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.