నాగారం గ్రామంలో శనివారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. సర్వేలో భాగంగా మండల కమిటీ సభ్యుడు మంద సుచందర్ మాట్లాడుతూ గ్రామంలో సర్వే ద్వారా వివిధ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీధిలైట్లు 24 గంటల పాటు వెలుగుతూ విద్యుత్ వ్యర్థం అవుతోంది. కావున గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.