డంపింగ్ యార్డ్ గా మారిన నాగేంద్ర నగర్

55చూసినవారు
వరంగల్ లో నాగేంద్ర నగర్ నాగమయ్య గుడి వద్ద చెత్తతో డంపింగ్ యార్డ్ గా మారింది. ఈ చెత్త స‌మ‌స్య నాగేంద్ర నగర్ వాసుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. చెత్త డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాస‌న రావటంతో పాటు వ‌ర్షాకాలంలో అయితే ప‌రిస్థితి మ‌రి దారుణంగా ఉంటుందని స్థానికులు శుక్రవారం అంటున్నారు. దోమ‌లు, విష‌పురుగులు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, దీంతో ప్రజలు జ్వరాల బారిన‌ప‌డి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు.

సంబంధిత పోస్ట్