సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

74చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హనుమకొండ పరిధిలోని ఏరియాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ వైద్యాధికారిని డాక్టర్ గీత ప్రజలకు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ త్రాగునీరును వేడిచేసి చల్లార్చి వడపోసుకుని త్రాగాలని, ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్