ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లో బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న సభను శనివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. గత 15 రోజులుగా ముస్లిం మత పెద్దలు మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎసిపి నందిరాం నాయక్ ను అడగగా, వారు మీరు సభకు ఏర్పాట్లు చేసుకోండి అని అన్న నేపథ్యంలో సభకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇప్పుడుపోలీసు బృందాలు వచ్చి జరగబోయే సభను ఆపాలని ముస్లిం మత పెద్దలకు చెప్పారు.