ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే రౌడీ షీటర్ల పట్ల పోలీసులు కఠినముగా వ్యవహారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. సిబ్బంది కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. అలాగే పెండింగి కేసులు, నిందితుల అరెస్ట్, రౌడీ షీటర్ల ట్రిపుల్ సి ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.