వరంగల్లో ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడి

50చూసినవారు
వరంగల్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన బాలిక (16) ఇంటర్మీడియట్ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్ (20), బాలిక మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది నెలలుగా ప్రేమ, పెళ్లి పేరుతో బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా గర్భవతి అని తేలింది. మంగళవారం యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్