వరంగల్ ఎంజీ రోడ్డులోని శ్రావణి బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో ఉన్న తిను బండారాలను పరిశీలించారు. దీంతో కాలం చెల్లిన ఫ్రోజెన్ చేప మాంసాన్ని గుర్తించారు. బార్ లో సరైన ఆరోగ్య ప్రమాణాలు పాటించడం లేదని యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.