కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసి ప్రజల మన్నన పొందిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆరు హామీలు అమలు చేశామన్నారు.