వరంగల్ శాంతి నగర్ లో మట్కా నిర్వహిస్తున్న బండి రాజు నివాసంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ. 32 వేలు స్వాధీనం చేసుకున్నారు. చిరువ్యాపారులను మోసం చేసి బెట్టింగ్ నిర్వహకుడిని విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేసారు. ఈ విషయాన్ని టాస్క్ ఫోర్స్ సీఐ కె. శ్రీధర్ గురువారం రాత్రి తెలిపారు.