
‘కాల్పుల విరమణ’ కొనసాగించాలని భారత్-పాక్ నిర్ణయం
కాల్పుల విరమణ(సీజ్ ఫైర్) అవగాహనను కొనసాగించాలని భారత్, పాకిస్థాన్ నిర్ణయించాయి. ఈ నెల 10న డీజీఎంవోల మధ్య కుదిరిన అవగాహనను కొనసాగించనున్నారు. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు కొనసాగించాలని ఇరు దేశాల డీజీఎంవోలు నిర్ణయం తీసుకున్నారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిదాడిగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'తో విరుచుకుపడిన విషయం తెలిసిందే.