కలకత్తా ఆర్టీజీ కేఏఆర్ కళాశాల వైద్య విద్యార్థిని హత్య విషయంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం రెండో రోజు కొనసాగింది. ఎంజీఎం దవాఖాన ఆవరణలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం ఎంజీఎం సెంటర్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు.