వరంగల్ జిల్లాలో తొలి ఏకాదశి వచ్చిందంటే చాలు బోనాలు సందడి మొదలవుతుంది. ఆదివారం కరీమాబాద్ ఉర్సు గుట్ట సమీపంలో బీరప్పకు ఘనంగా బోనాలు చెల్లిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీరన్నను దర్శించుకుంటారు. ఆషాఢ మాసంలో వరంగల్ నగరంలో మొదట బోనాలు ఇక్కడే నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు.