వైష్ణవ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ బట్టల బజార్ లోని బాల వెంకటేశ్వర ఆలయం, గీతా భవన్ ఉత్తర ద్వారా దర్శనాల కొరకు భక్తులు ఉదయం నాలుగు గంటల నుండి క్యూ లైన్లలో భారీగా వేచి చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి రెండు గంటల టైమ్ పడుతుంది. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.