
జనసేనలో చేరనున్న ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు?
AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జీవీఎంసీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత బెహరా భాస్కరరావు సోమవారం కూటమి నేతలను కలిశారు. బెహరా భాస్కరరావు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణను కలిసి ఆయనతో చర్చలు జరిపారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో.. జనసేనలోకి ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నట్లు సమాచారం. దీంతో వైసీపీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.