వరంగల్: జల్సా కోసం సొంత ఇంటికే కన్నం వేసిన ఘనుడు

67చూసినవారు
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమర కోటకి చెందిన గుర్రపు రామకృష్ణ ఇంట్లో ఆదివారం జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. రామకృష్ణ ఫ్యామిలీ హైదరాబాద్ కి ఫంక్షన్ కోసం వెళ్లి మరలా అదే రోజు రాత్రి 08. 30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో బీరువా తాళాలు తెరిచి కనిపించాయి. దీంతో వారు ఆ బీరువాను వెతకగా అందులో ఉండవలసిన మొత్తం 16 తులాల బంగారు బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు లో రామకృష్ణ కుమారుడు జయంత్ ను దొంగ గా గుర్తించారు. గర్ల్ ఫ్రెండ్ తో జల్సా కోసం సొంత ఇంటికే కన్నంవేసాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్