ఎంజీఎం సిబ్బందికి వరంగల్ ఏసీపీ సూచనలు

50చూసినవారు
ఎంజీఎం సిబ్బందికి వరంగల్ ఏసీపీ సూచనలు
వరంగల్ ఎంజీఎం పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. కొద్ది రోజులుగా హాస్పిటల్ పరిసరాల్లో వాహనాలు, సెల్ ఫోన్లు చోరీ కావడంతో పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. హాస్పిటల్ సిబ్బందికి చోరీల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలతో పాటు దొంగలను గుర్తించడంపై ఏసీపీ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్