ప్రతి పౌరుడు సమాజం లో బాధ్యతాయుతమైన మంచి పౌరులుగా ఉండాలని జడ్జి సాయి కుమార్ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, జడ్జి యం. సాయి కుమార్ వరంగల్ ఆటోనగర్ లోని ప్రభుత్వ బాలుర గృహన్ని ఆయన అకస్మికంగా సందర్శించారు. అక్కడి బాలలకు అందిస్తున్న సౌకర్యాలను, వసతులను పరిశీలించారు. అక్కడి పరిశుభ్రత బాలల సంక్షేమంపై సూపరిండెంట్ ని అడిగి తెలుసుకున్నారు.