వరంగల్ మహానగరంలో ముంపు ప్రాంతాలు ఏటేటా పెరుగుతున్నాయని, నాలాల కబ్జా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చినుకుపడితే నగరవాసులు జంకుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం డబ్ల్యూజీఎంసీ కమిషనర్ కు బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ అగర్తల చెరువు నుంచి చేపట్టిన డ్రైనేజీ కాల్వ పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు.