వరంగల్: పూడిక తీసిన గుంతలో పడి బాలుడి మృతి

78చూసినవారు
చెరువు పూడిక తీసిన గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. భద్రకాళి చెరువులో పూడిక తీసిన గుంతలో పాపయ్యపేటకు చెందిన బాలుడు ఇమ్రాన్ (15) ప్రమాదవశాత్తు పడ్డాడు. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికే బాలుడు మరణించాడు. బాలుడి మృతి పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్