వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారదా ఇన్‌చార్జి ఆదనవు కలెక్టర్ విజయలక్ష్మితో కలసి తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి వివరాలను తెలుసుకున్నారు.