డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా బొల్లి కుంట వాగ్దేవి కళాశాలలో వరంగల్ మహానగర పాలక సంస్థ ఆవరణలో గల మెప్మా భవనంలో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలని అన్నారు.