ప్రతి ఏటా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ కీలక సమయంలో అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తున్న ఫర్టిలైజర్ షాపులు, అలాగే లేబుల్ లేని నకిలీ ఎరువుల విక్రయాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సరైన నిఘా కొరవడటంతో నకిలీ ఎరువులు యథేచ్ఛగా మార్కెట్ లోకి వస్తుండటం, వాటిని కొనుగోలు చేసి నష్టపోతామేమోనని రైతులు భయపడుతున్నారు.