వరంగల్: బాధ్యతలు చేపట్టిన గ్రేటర్ మున్సిపల్ కమిషనర్

73చూసినవారు
వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేసి గ్రేటర్ వరంగల్ కమిషనర్ గా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది తనకు మంచి అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ గురించి తెలుసుకుంటానని, నగర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్