వరంగల్: భద్రకాళి అమ్మవారి భక్తులకు కీలక సూచన

5చూసినవారు
వరంగల్ భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులకు ఈవో శేషుభారతి శుక్రవారం కీలక సూచనలు చేశారు. ఈ నెల 8, 9, 10న ఆలయంలో ప్రదక్షిణలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన అమ్మవారి కోసం 20 వేల మంది ర్యాలీగా కూరగాయలు తీసుకువస్తారని పేర్కొన్నారు. అమ్మవారిని అలంకరించే క్రమంలో ఆలయ ప్రాంగణం మొత్తం నిండుగా ఉంటుందని, కావున ప్రదక్షిణలు నిలిపివేస్తున్నట్లు వివరించారు. భక్తులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్