వరంగల్ నగరంలో శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షం పడుతోంది.
ఉర్సు బొడ్రాయి ప్రాంతంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. చెట్టుపై పిడుగుపాటుతో అంటుకున్న మంటలు ఆర్పడానికి స్థానికులు ప్రయత్నించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.