వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కీటక జనిత వ్యాధులపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున కాలానుగుణంగా సంభవించే వ్యాధులైన కీటక జనిత వ్యాధుల పట్ల జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.