భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం పోచం మైదాన్ సర్కిల్లో గత ఆరు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్స్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.