మహిళల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం 2014 అక్టోబర్ 24 న షీ టీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో 2024 అక్టోబర్ 24 నాటికి పదేళ్లు పూర్తి చేసున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా కల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.