వరంగల్: నాటు సారా, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి

64చూసినవారు
వరంగల్: నాటు సారా, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్య శారదని పాలకుర్తి విజయ్ కుమార్, అంతర్జాతీయ మానవ హక్కుల ఆర్గనైజేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లోని ఆరు మండలాల పరిధిలో నాటు సారా, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అక్రమంగా సాగుతున్నాయని వినతిపత్రం ద్వారా తెలియజేసారు. ముఖ్యంగా నల్లబెల్లి మండలంలో నాటు సారా, బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్