వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా సోమవారం కాశీబుగ్గ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గజ్జల రామ్ కిషన్ మాట్లాడతూ బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆయన ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమే అని అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీశాలి అని కొనియాడారు.