జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరంగల్ మీటింగ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం తీవ్ర నీళ్ల విరోచనాలు వాంతులు నుండి కాపాడే రోటా వైరస్ వ్యాక్సిన్ గురించి డాక్టర్లకు, సూపర్వైజర్ ఆఫీసర్లకు, ఫార్మసీ ఆఫీసర్లకు, నర్సింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. నోటి ద్వారా ఇచ్చే ఒక రోటా వైరస్ వ్యాక్సిన్ ఒక్క వాయల్లో 2 డోసులు ఉంటాయి, బిడ్డ పుట్టిన 6, 10, 14 వారాల వయసులో ఈ వ్యాక్సిన్ ఇస్తారు.