రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం శాయంపేట మండల పరిధిలోని నేరేడుపల్లి, హుస్సేన్ పల్లి, శాయంపేట, మాందారిపేట, పెద్దకోడెపాక గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.