గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ప్రైవేట్ ఔట్సోర్సింగ్, స్వచ్ఛ భారత్ ఆటో ట్రాలీ, ట్రాక్టర్ డ్రైవర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ వరంగల్ హనమకొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బల్దియా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సఫాయి కార్మికులకు, చెప్పులు, చీపురు కట్టలు, డ్రెస్సులు, నూనె లాంటి వస్తువులు వెంటనే అందజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అందజేయాలని కోరారు.