వరంగల్: ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల సమావేశంలో పాల్గొన్నమంత్రి
గురువారం రోజున రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖా కొండా సురేఖ మామునూర్ ఎయిర్ పోర్ట్ ను సందర్శించి అనంతరం గుంటూరుపల్లిలో జరిగిన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాలకు చెందిన ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.