వరంగల్: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం కింద వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర వయోజన విద్య సంచాలకులు ఉషారాణి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉల్లాస్ పథకం కింద అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమ పురోగతిని సమీక్షించారు.