శంభునిపేట గండి మార్గంలో వ్యర్థాలు
ఖిలావరంగల్ నుంచి శంభునిపేటకు వెళ్లే రోడ్డుకు ఇరుపక్కలా చికెన్ వ్యర్థాలు, చెత్తను ఇష్టారాజ్యంగా డంప్ చేస్తుండటంతో ప్రయాణికులు దుర్వాసనకు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చెత్త లేకుండా తొలగించాల్సిన పారిశుద్ధ్య కార్మికులే.. ఇక్కడ పోయడం శోచనీయమని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.