హనుమకొండ ప్రజావాణికి 71 దరఖాస్తులు

71చూసినవారు
హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం 71 దరఖాస్తులు అందజేశారని తెలిపారు. అట్టి ఆర్జీలను సత్వరమే పరిష్కారం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్